Hot Posts

6/recent/ticker-posts

TG GROUP-1, Prelims primary Key Released

TG GROUP-1, Prelims primary Key Released 



తెలంగాణ గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక కీ విడుదల


 👉ఇటీవల జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథమిక కీ (Group 1 Prelims key) విడుదలైంది. ఈ పరీక్ష కీతో పాటు మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.  జూన్‌ 13 నుంచి 17వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఈ లింక్‌ను ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. లాగిన్‌ అయ్యాక కీ పట్ల ఏవైనా అభ్యంతరాలుంటే అక్కడే ఇచ్చిన టెక్స్ట్‌ బాక్స్‌లో ఇంగ్లిష్‌లో తెలపవచ్చని పేర్కొంది.


👉అలాగే, కీ పట్ల తమ అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను (ఉదా: రచయిత పేరు/ఎడిషన్‌/పేజీ నంబర్‌/పబ్లిషర్స్‌ పేరు/వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌ వంటివి) అప్‌లోడ్‌ చేయవచ్చని కమిషన్‌ సూచించింది. ఈమెయిల్స్‌, వ్యక్తిగతంగా కలిసి అభ్యంతరాలు తెలపడం వంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చి చెప్పింది. అలాగే, నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించబోమని పేర్కొంది..


 👉మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి  జూన్‌ 9న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3.02 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.


💥ప్రాథమిక కీ కోసం క్లిక్‌ చేయండి..👇👇👇


CLICK HERE



Join Telegram channel