Hot Posts

6/recent/ticker-posts

స్లాట్ బుక్ చేసుకున్న వారికే టీకా..

 స్లాట్ బుక్ చేసుకున్న వారికే కోవిడ్ టీకా..





👉కొవిడ్ టీకా వేసే విషయంలో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తీసుకున్న నిర్ణయం గందరగోళం గా మారింది. 

👉ఇక నుంచి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే టీకా ఇస్తామని సంబంధిత శాఖ ప్రకటిం చింది. 

👉దీనివల్ల సామాన్యులు టీకాకు దూర మయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ నిర్ణయం రెండో డోసు తీసుకోవాల్సిన లక్షలాదిమం దిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. 


👉ఇప్పటికే 20 రోజుల తరువాత గానీ ఆన్ లైలో స్లాట్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త ఆంక్షల వల్ల ఇప్పట్లో తమకు టీకా మొదటి డోసు దొరికే అవకాశాలు కన్పించడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


👉హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 1.20 కోట్ల మంది కరోనా నివారణ టీకా వేయించుకో వాల్సి ఉండగా.. ఇప్పటివరకు దాదాపు 15 లక్షల మందికి వేశారు. రెండో డోసు కోసం దాదాపు మూడు లక్షలమందికి పైగా ఎదురుచూస్తున్నారు. 


👉ఇప్పటివరకు నేరుగా టీకా కేంద్రానికి ఆధార్ కార్డుతో వెళితే అక్కడే ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి వ్యాక్సిన్ వేసేవారు. 


👉టీకా డోసుల కొరత కారణంగా మూడు రోజులుగా నగరవ్యా ప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివే శారు. ప్రసుత్తం వైద్య ఆరోగ్య శాఖ దగ్గర టీకా నిల్వలు తక్కువగానే ఉన్నాయి. 


👉ఈ నేపథ్యంలో టీకా పంపిణీలో కొత్త విధానం పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు.

 

👉ఇందులో భాగంగా టీకా వేయించుకునే వారు తప్పకుండా కొవిన్ యాప్లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ లింకను ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. అందులో కావాల్సిన కేంద్రాన్ని టిక్ చేస్తే సంబంధిత వ్యక్తి ఫోన్ కు ఎప్పుడు టీకా వేయించుకోవాలన్న మెసేజ్ వస్తుంది. 


👉ఈ మెసేజ్ లోని తేదీ ప్రకారం సంబంధిత కేంద్రానికి వెళితే అప్పుడు టీకా వేస్తారు.


👇👇👇


Registration