Hot Posts

6/recent/ticker-posts

Bank timings changes

 




  బ్యాంకు పనివేళలు మార్పు. 



తెలంగాణలో లాక్‌డౌన్‌ సడలింపు వేళల పొడిగింపు నేపథ్యంలో రాష్ట్రాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. 



బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేయాలంటూ సమావేశంలో పలువురు కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. 


దీంతో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ తెలిపింది. 


ఇప్పటి వరకు బ్యాంక్‌ పనివేళలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండేవి. 



రాష్ట్ర ప్రభుత్వం సడలింపు సమయాన్ని పొడిగించడంతో బ్యాంకర్ల కమిటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.



                                                   
తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 10వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది. 


అత్యవసర సహా ప్రభుత్వం గతంలో అనుమతించిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.